Janani Janma / జననీ జన్మ Lyrics : Bobbili-Puli Movie

68
Janani Janma / జననీ జన్మ Lyrics : Bobbili-Puli Movie
Janani Janma / జననీ జన్మ Lyrics : Bobbili-Puli Movie

Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
Actress : Jayachitra / జయచిత్ర , Sridevi / శ్రీదేవి ,
Music Director : J.V.Raghavulu / జె.వి.రాఘవులు ,
Lyrics Writer : Dasari Narayana Rao / దాసరి నారాయణ రావు ,
Singer : S p balu / యస్ పి బాలు ,
Song Category : Patriotic Songs

జననీ జన్మ భుమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ..
స్వర్గాదపీ గరీయసీ!!
ఏ తల్లి నిను కన్నదో??ఏ తల్లి నిను కన్నదో..
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా!!

జననీ జన్మ భుమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ..
స్వర్గాదపీ గరీయసీ!!
నీ తల్లి మోసేది నవమాసాలే రా..
ఈ తల్లి మోయాలి కడవరకు రా..
కట్టే కాలే వరకు రా!!

ఆ ఋణం తలకొరివి తో తీరేను రా..
ఈ ఋణం ఏ రూపాన తీరేది రా??
ఆ రూపమే ఈ జవాను రా
త్యాగానికి మరో రూపు నువ్వు రా!!
జననీ జన్మ భుమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ..
స్వర్గాదపీ గరీయసీ!!

గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో..
ఆ గుండెకే తెలుసూ గుండె కోత బాదెంతో..
నీ గుండె రాయి కావాలి..ఆ గుండెలో ఫిరంగులు మోగాలి!!
మనిషిగా పుట్టిన ఓ మనిషీ..
మారాలి నువ్వు రాక్షసుడిగా..

మనుషులకోసం..ఈ మనుషులకోసం..
ఈ మనుషులకోసం!!
జననీ జన్మ భుమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ..
స్వర్గాదపీ గరీయసీ!!

jananI janma bhumishca.. swargaadapI garIyasI..
swargaadapI garIyasI!!
E talli ninu kannadO??E talli ninu kannadO..
aa tallinE kanna bhUmi goppadiraa!!
jananI janma bhumishca.. swargaadapI garIyasI..
swargaadapI garIyasI!!

nI talli mOsEdi navamaasaalE raa..
I talli mOyaali kaDavaraku raa..
kaTTE kaalE varaku raa!!
aa RuNaM talakorivi tO tIrEnu raa..
I RuNaM E rUpaana tIrEdi raa??

aa rUpamE I javaanu raa
tyaagaaniki marO rUpu nuvvu raa!!
jananI janma bhumishca.. swargaadapI garIyasI..
swargaadapI garIyasI!!

guMDe guMDeku telusu guMDe baruveMtO..
aa guMDekE telusU guMDe kOta baadeMtO..
nI guMDe raayi kaavaali..aa guMDelO phiraMgulu mOgaali!!
maniShigaa puTTina O maniShI..
maaraali nuvvu raakShasuDigaa..

manuShulakOsaM..I manuShulakOsaM..
I manuShulakOsaM!!
jananI janma bhumishca.. swargaadapI garIyasI..
swargaadapI garIyasI!!